HYD: కాశ్మీర్ పహల్గాంలో అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హైదరాబాద్ నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాహమ్మద్ షకిల్ పేర్కొన్నారు. ఓల్డ్ మలక్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ క్యాండిల్స్‌తో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన వారికి నివాళులర్పించారు.