సత్యసాయి: బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కార్పొరేట్‌కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రలో బోధనా సదుపాయలు కల్పించామన్నారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సవిత శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వంట గదిని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.