NLG: వేములపల్లి మండల కేంద్రంలో శుక్రవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సాగులో ఉన్న ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. గతంలో ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.