మెదక్: పాశమైలారంలోని పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కి చేరింది. అయితే, పేలుడు సంభవించిన సమయంలో 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్లే పలువురు సజీవ దహనమయ్యారు. గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. పలువురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.