SRPT: హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పల్లె వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ అనుములగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో 52 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు.