WNP: కొత్తకోటలోని అమడబాకుల కస్తూర్బాలో కొత్తగా మంజూరైన ఇంటర్ మొదటి ఏడాదిలో అకౌంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి చందన తెలిపారు. పదో తరగతి పూర్తి చేసి, ఆసక్తి ఉన్న విద్యార్థినులు నేరుగా విద్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కోర్సు పూర్తి చేస్తే విద్యార్థినులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.