KKD: జగ్గంపేట నియోజకవర్గ స్థాయిలో రేపటి నుంచి 30వ తేదీ వరకు NDA కూటమి ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు.