TPT: పుత్తూరు డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు రిటైరయ్యారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సన్మాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప విద్యాశాఖ అధికారిని శాలువాతో సత్కరించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.