కృష్ణా: ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల మంచి కోసం కలిసి పని చేద్దామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే రాముని రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.