AKP: నర్సీపట్నం పెదబొడ్డేపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. గత కొద్ది కాలంగా 45 సంవత్సరాల ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా వైద్య బృందం సుమారు 7కేజీల బరువు కలిగిన అండాశయ కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి అండాశయ కణితి తొలగించినట్లు వైద్యులు తెలిపారు.