VZM: బదిలీపై వెళ్తున్న బొబ్బిలి సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణ శ్రీకు బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. స్థానిక కోర్టులో శుక్రవారం ఆమె సేవలను బార్ సభ్యులు కొనియాడారు. ఈ సందర్బంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.మోహన మురళీ కుమార్, ప్రధాన కార్యదర్శి కొల్లి సింహాచలం, ఎం.సింహాచలం పాల్గొన్నారు.