SDPT: ఈ నెల 25న సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల పరీక్ష ఏర్పాట్లను శనివారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహించే గదులను పరిశీలించి గాలి, వెలుతురు సరిగా వచ్చేలా చూడాలని అన్నారు. అలాగే గోడ గడియారం ఏర్పాటు చేయాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.