KNR: జమ్మికుంటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నెలకొల్పాలని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన న్యాయవాదులు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు. 3 మండలాల పరిధిలో సివిల్, క్రిమినల్ కేసులు 4వేలు విచారణకు ఉన్నాయని అన్నారు. జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలని 30 మంది న్యాయవాదులు ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు.