ADB: ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.