ADB: చత్రపతి శివాజీ జీవితం నుంచి యువత ప్రేరణ పొందాలని మాజీమంత్రి, BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. బేల మండలంలో ఆదివారం నిర్వహించిన చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శివాజీ మహారాజ్ దేశభక్తితో పాటు ఐక్యత భావానికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.