WGL: వర్ధన్నపేట పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లపై మంగళవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 5 టిఫిన్ సెంటర్లలో 15 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.