NZB: ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీపీ సాయి చైతన్యకు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు గురువారం ఆహ్వానించారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రుల కళ్యాణం ఉంటుందని పేర్కొన్నారు.