MDK: రామాయంపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మృతి చెందిన కోళ్లు, వాటి వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు ఇష్టారాజ్యంగా పారేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమలు వృద్ధి చెంది గ్రామస్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అంటువ్యాధులు మరింత ప్రబలకముందే అధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.