VKB: దుద్యాల మండల పరిధిలో మహబూబ్ నగర్-చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పర్సాపూర్ సమీపంలో రోడ్డు పనులు సాగుతున్నాయి. తొందరగా పూర్తి చేయకపోవడంతో తాత్కాలిక రోడ్డుపై వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనదారులు తొందరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.