SRD: కంగ్టి మండలం బాన్సువాడలో శనివారం సర్పంచ్ సౌజన్య మాణిక్ రెడ్డి ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ మల్లయోధులు పాల్గొననున్నారు. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయండని పేర్కొన్నారు.