KMM: తిరుమలాయపాలెం మండలం గోల్ తండాకు చెందిన బానోత్ ప్రేమ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రైలుకింద పడి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పిండిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన ఖమ్మం దానవాయిగూడెం సమీపంలో బైక్ నిలిచి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చి పరిశీలించారు. వ్యక్తి ఛిద్రమైన స్థితిలో ఉండటాన్ని గమనించి GRP పోలీసులకు సమాచారం అందించారు.