BDK: అన్నపురెడ్డిపల్లి మండలం రజబలినగర్ గుత్తి కోయ ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ ఇవాళ సందర్శించారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పిల్లలతో కలిసి నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు విధిగా పాఠశాలకు వెళ్లి పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు.