»Arguments Ended On The Film Rgv Vyuham High Court Reserved Judgment
RGV Vyuham: వ్యూహం సినిమాపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై దాఖలైన పిటీషన్ల మీద నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించనుంది.
RGV Vyuham: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) ఏపీ రాజకీయాంశాలు ప్రతిబింబించేలా తెరకెక్కించిన చిత్రం వ్యూహం(Vyuham). నిర్మాణాంతర పనులు ముగించుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కానుండగా, సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దాంతో ఇన్ని రోజులు కోర్టు వాదనలు నడిచాయి. నేటితో ఇరువైపుల వాదనలు ముగిశాయి. హైకోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం వెలువరించనుంది.
ఈ చిత్రంలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సెన్సార్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తొలగించాలని వ్యూహం చిత్రం నిర్మా దాసరి కిరణ్ కుమార్ హైకోర్టును కోరారు. ఇరువైపుల లాయర్లు వాదనలు వినిపించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.