»Shock For Brs 21 Councilors Resigned In Bellampelli
BRS: బీఆర్ఎస్కు షాక్… 21 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా
తెలంగాణలో బీఆరఎస్ పార్టీకిి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే సారి 21మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే వారిని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
Shock for BRS... 21 councilors resigned in Bellampelli
BRS: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిని 21 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 19 మంది సంతకాలు చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు రాజీనామా లేఖను పంపారు. సంతకాలు చేయనప్పటికీ వైస్ ఛైర్మన్ పాటు, 14వ వార్డు కౌన్సిలర్ కూడా ఈ రాజీనామాల జాబితాలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగనుంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్కు 11 మంది, బీజేపీకి ఒకరు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి 21 మంది రాజీనామ చేయడం చర్చనీయంగా మారింది.