BRS: తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్కు ఈ సీనియర్ లీడర్ రాజీనామా చేయడం పెద్ద షాకక్ అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో రాజయ్య త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. చివరి ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడంతో, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ టికెట్ ఆశించినట్లు తెలుస్తుంది. దీనిపై పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో తన అనుచరులతో చర్చింది పార్టీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
రెండు రోజులు క్రితం రాజయ్య మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. పార్టీకి రాజీనామా చేయడంతో, ఫిబ్రవరి 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని అంతర్గత సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్చ మళ్లీ తెరమీదకు వస్తుంది. వీరి కలయిక నియోజకవర్గ అభివృద్ది గురించే అని చెప్పినప్పటికీ పలు అనుమానాలకు తావిస్తోంది.