shock to YCP, Rajya Sabha MP Vemireddy Prabhakar Reddy resigned.
MP Vemireddy Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హీట్ ఎక్కింది. నాయకుల సభలతో ఏపీ నలుదిక్కులు మారుమోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కండువలు మార్చుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీకి గట్టి షాక్ తగిలింది. ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ఆయన రిజైన్‌కు సంబంధించిన లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలవల్లనే పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.