MDK: నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6వ తేదీ చివరి తేదీ అని మెదక్ డీఈవో రాధా కిషన్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ వసతి లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు www.bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి 12,000 ఉపకార వేతనం అందిస్తారన్నారు.