AKP: అచ్యుతాపురం(M)రామన్నపాలెంలో వోల్టేజ్ సమస్యను అధిగమించడానికి శనివారం కొత్త ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేశారు. ఓల్టేజ్ సమస్య ఉందని గ్రామస్థులు సమస్యను పలుమార్లు ఏఈ దృష్టికి తేవడంతో విద్యుత్ అధికారులు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకొని 63కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఏఈ ఎం.శ్రీనివాసరావు ఉదయం నుంచి సాయంత్రం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.