కామారెడ్డిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రవీందర్ గౌడ్ తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీల్లో భాగంగా ఆసుపత్రుల అనుమతి పత్రాలపై ఆరా తీసి పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. PCPNDT యాక్ట్ అమలు తీరును ఆసుపత్రి యాజమాన్యాలను అడిగి తెలుసుకున్నారు.