రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మొదటిరోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 99.89 హాజరు శాతంతో 7299 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో తెలిపారు.