RR: చేవెళ్ల మండలం నారాయణదాస్ గూడలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి శ్రీనివాస్, ఆయన భార్య లావణ్య, కుమార్తె పావని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.