GDWL: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల్ రూరల్ సీఐ శ్రీకాంత్ పర్యవేక్షణలో సంగాల గ్రామంలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆటపాటల ద్వారా సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణ, మహిళా రక్షణ (షీ టీమ్స్), రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.