SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కల్పనదేవి మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణతోనే మానవజాతి మనుగడ సాధ్యమని, అడవుల విధ్వంసం వల్ల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని, పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.