MLG: కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల విస్తరణ ప్రణాళికలు చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. తాడ్వాయి మండలం మేడారంలో ఎస్పీ శబరిశ్తో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు వరుస ప్రకారం విస్తరణ ప్రణాళికలు, భక్తుల సౌలభ్యం కొరకు క్యూలైన్ల ఏర్పాట్లు గురించి ఆరా తీశారు.