ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో “RAKESH REDDY E-CLASSES APP” అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన కోర్సులు అందించనున్నారు. యాప్ వినియోగంపై అవగాహన కోసం మే 28న ఖమ్మంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఉచిత డెమో సెషన్ నిర్వహించనున్నారు.