SRD: GST స్లాబ్ రేట్లు తగ్గించినందుకు కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం జీఎస్టీ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.