SRCL: వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న–అరుణ్ కుమార్ దంపతులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్, జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కళ్యాణ్ మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.