గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలాల్లో జరిగే మొదటి విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి కూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు.