»Aaya Forgot The Child In The Anganwadi And Locked It
Anganwadi : అంగన్వాడీలో చిన్నారిని మరిచి తాళం వేసిన ఆయా
మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగన్వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మరిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగన్వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మరిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్ (ICDS) అధికారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా స్థానికంగా నివసిస్తున్న వడ్డె మల్లప్ప- విజయలక్ష్మిలకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు ఖాజీపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగా, చిన్న కూతురు అవంతిక(3) (Avantika)ఇదే పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది. అవంతిక ఉదయం ఇద్దరు అక్కలతో కలిసి పాఠశాలకు వెళ్లి అంగన్వాడీలో కూర్చుంది. మధ్యాహ్నం 2.30కు అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి అనారోగ్యంతో ఇంటికి వెళ్లిపోగా.. ఆయా జ్యోతి పరిశీలించకుండానే కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయింది.
కూలి పని నుంచి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చిన్న కూతురు అవంతిక కనిపించలేదు. దీంతో సమీపంలోని గుంతలు, మురుగు కాలువల్లో వెతికారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. చివరకు రాత్రి 8.45 గంటలకు సర్పంచి(Sarpan̄ci) సత్యనారాయణ జోక్యంతో అంగన్వాడీ టీచర్, ఆయాలను పిలిపించి కేంద్రం తాళం తీయించారు. లోపల స్టోర్ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న అవంతికను గుర్తించి వెంటనే సపర్యలు చేయటంతో స్పృహలోకి వచ్చింది. ఐసీడీఎస్ సీడీపీవో (CDPS) చంద్రకళ, మండల పర్యవేక్షకురాలు మీరాబాయి కేంద్రాన్ని సందర్శించి టీచర్, ఆయాకు షోకాజు నోటీసు(NOTICE) ఇచ్చారు.