»46 Country Delegates 2 Lakh Crore Rupees Investment Target
minister amarnath on global summit:46 దేశాల ప్రతినిధులు.. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
minister amarnath on global summit:విశాఖపట్నంలో (vizag) నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. దీంతో యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో గల జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
46 country delegates, 2 lakh crore rupees investment target
minister amarnath on global summit:విశాఖపట్నంలో (vizag) నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. దీంతో యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో గల జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ రేపు ప్రారంభం కానుంది. సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. Advantage.ap.inలో 14వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రేపు వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టారు. ఈ సాయంత్రం సీఎం జగన్ (cm jagan) విశాఖకు (vizag) చేరుకుంటారు. రేపు జరగబోయే సదస్సుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రేపు 10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును ప్రారంభిస్తారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. ఇనాగురల్ సెషన్ మధ్యాహ్నాం 2 గంటలకు ఉంటుంది. కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నాం. 150 పై చిలుకు స్టాల్స్‌కు (stalls) సంబంధించిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో (nitin gadkari) సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ జరగనున్నాయి. పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్‌లో పాల్గొంటారు’ అని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
చదవండి:Inferior food:తిరుమల అన్నదాన సత్రంలో నాసికరం భోజనం (వీడియో)
జగన్ అంటే క్రెడిబిలిటీ.. ఆయన నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది అనే నమ్మకాన్ని రాష్ట్రంలో గల పారిశ్రామిక వేత్తలకి కల్పించామన్నారు. అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం, యువతకు ఉపాధి కల్పించడమే సదస్సు ముఖ్య ఉద్దేశం అని వివరించారు. 46 దేశాల ప్రముఖులు (46 country).. 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ వస్తున్నారని తెలిపారు. రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రా రుచులతో విందు ఉంటుందని తెలిపారు.
చదవండి:Inferior food:తిరుమల అన్నదాన సత్రంలో నాసికరం భోజనం (వీడియో)
పెట్టుబడులు పెట్టేవారికి భూమి సహా అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి (minister amarnath) తెలిపారు. ఎంవోయూలను ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం జగన్ (cm jagan) సూచించారని వెల్లడించారు. ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ క్రియేట్ చేశామన్నారు. మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్‌గా పెట్టుకున్నారని అమర్ నాథ్ (minister amarnath) తెలిపారు. కొత్త ఇన్వెస్ట్ మెంట్ పాలసీ తీసుకువస్తున్నామని తెలిపారు. దావోస్‌కు వెళ్లడం, అక్కడ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి చెప్పుకోవడం కాదని, దావోస్‌కు వస్తున్న ప్రతినిధులనే రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, ఏది గొప్ప అని అమర్ నాథ్ ప్రశ్నించారు. కనీసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
చదవండి:Inferior food:తిరుమల అన్నదాన సత్రంలో నాసికరం భోజనం (వీడియో)
ఇటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై (ganta srinivas) అమర్ నాథ్ ఫైరయ్యారు. గంటా రాసిన లేఖపై స్పందించారు. దావోస్ వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. ఆ లేఖ గంటా శ్రీనివాసరావు రాసినట్టు లేదని, చంద్రబాబు (chandrababu) రాసిన లేఖపై గంటా సంతకం పెట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కడుపు మంటతో రాసిన లేఖలా కనిపిస్తోందని అన్నారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని (chandrababu) అమర్ నాథ్ ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. 10 ఏళ్లకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేదని.. కానీ చంద్రబాబు పారిపోయి వచ్చారు. రాజధాని లేదని ఎలా అంటారు. వాళ్లకు మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు.