»Cm Yogi Gives Strict Warning To Those Who Disturb The Law And Order
Lucknow : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి సీఎం యోగి స్ట్రిక్ట్ వార్నింగ్
మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్‌లు హతమైన వేళ.. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని.. కానీ, ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా (Mafia) వ్యాపారవేత్తలను బెదిరించలేరని సీఎం యోగి తెలిపారు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇన్వెస్ట్ మెంట్ (Investment)పెట్టేవారికి రక్షణ కల్పిస్తామని ఆయన భరోసా కల్పించారు. ఇప్పుడు మాఫియా ఎవర్నీ భయపెట్టలేదు అని సీఎం వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో అతిక్ సోదరుల (Atiq’s brothers) హత్య తరువాత తొలిసారిగా సీఎం స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రలు అదుపులో ఉన్నాయని ఆయన అన్నారు. లక్నో(Lucknow)లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి ఆధిత్యనాథ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.యూపీ లో 2017 కంటే ముందు శాంతి భద్రతలు ఘోరంగా ఉండేవని యోగి అన్నారు.
ఇప్పుడు యూపీలోని ఏ జిల్లాలోనూ అల్లర్లు లేవు. యూపీని అల్లర్లు రహితంగా మార్చింది మన ప్రభుత్వం అంటూ యోగి అన్నారు. యూపీ గుర్తింపు ధ్వంసమైన కాలం ఉందని, యూపీ గుర్తింపు మళ్లీ వస్తోంది. ఇప్పుడు యూపీ అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉందని అన్నారు.గతంలో యూపీలో రోజూ అల్లర్లు జరిగేవి. ఇప్పుడు లా రూల్(Rule of Law) ఉంది. ఆరేళ్లలో ఎలాంటి కర్ఫ్యూ విధించలేదని అన్నారు. గత మూడు రోజుల క్రితం యూపీ మాఫియా డాన్(Mafia don), మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ సోదరుల మరణం సంచలనంగా మారింది. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అతిక్ సోదరుల మరణం తరువాత రెండురోజుల పాటు సీఎం యోగి ఆధిత్య నాథ్ నిత్యం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి శాంతిభద్రతల (law and order) కు విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.