»Covid Booster Dose Vaccination From April 19th 2023 In Telangana
Covid Booster Dose: తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ బూస్టర్ డోసు టీకాలు
తెలంగాణ(telangana)లో ఏప్రిల్ 19 నుంచి కొర్బీ వ్యాక్సిన్ కోవిడ్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు(Covid booster dose) తీసుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ(telangana) ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 19, 2023 నుంచి బుస్టర్ డోసులు(Covid booster dose) అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొర్బీ వ్యాక్సిన్ టీకాను పంపిణీ చేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం 5 లక్షల డోసులు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. అయితే ఫస్ట్, రెెండో డోసుగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఏది తీసుకున్నా కూడా బూస్టర్ టీకాగా దీన్ని తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
మరోవైపు కరోనా కేసుల వ్యాప్తి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆరోగ్య మంత్రి టి హరీశ్ రావు సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పీహెచ్సీలలో ఈ టీకాలు అందుబాటులో ఉండేలా చుస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలో దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని హరీశ్ కోరారు. హైపర్టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి కొమొర్బిడిటీలు ఉన్నవారు ఇన్ఫెక్షన్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.