»No Salary For 700 People For Two Years Now The Insofe Company Has Lifted The Software Company
Software Company: 700 మందికి రెండేళ్లుగా నో శాలరీ..ఇప్పుడు ఎత్తేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ
హైదరాబాద్లో(hyderabad) మరో సాఫ్ట్ వేర్ సంస్థ 700 మంది ఉద్యోగులను మోసం చేసింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో(hyderabad)మరో సాఫ్ట్ వేర్ సంస్థ 700 మంది ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే మొత్తం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ పంపించింది. ఇది తెలిసిన ఎంప్లాయిస్ తెల్లవారుజామున ఆఫీస్ దగ్గరకు వెళ్లి చూడగా…సంస్థకు తాళం వేసి ఉంది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. దీంతోపాటు ఆ సంస్థ యాజమాని వివరాలతోపాటు సంస్థకు అప్పులు ఏమైనా ఉన్నాయా అనే సమాచారాన్ని సైతం సేకరిస్తున్నారు.
అంతేకాదు 700 మందిలో 650 మంది పేరుతో సంస్థ ఒక్కొక్కరి పేరిట రూ.4 లక్షల రుణాలు(loans) తీసుకున్నట్లు తెలిసింది. మరో 50 మంది పేరుతో రూ.10 లక్షల లోన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులే ఆ లోన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. అయితే ఆ లోన్ పేపర్లపై ఉద్యోగులు తెలిసే సంతకం చేశారా అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు 20 నెలల నుంచి అనేక మంది ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం.
గచ్చిబౌలి(gachibowli)లోని ఇన్సోఫీ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రస్తుతం హైటెక్ సిటీలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే లేఆఫ్ లతో అయోమయంలో పడిన ఐటీ ఉద్యోగులు.. చిన్న ఐటీ కంపెనీల లాభాలు బయటకు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్లో ఒక్కసారిగా 700 మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.