కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పరిణామాలపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
YS Jagan : వైఎస్ వివేకానంద రెడ్డి(YS vivekanda reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పరిణామాలపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు(Arrest) చేస్తే రాష్ట్రంలో నెలకొనే శాంతి భద్రతల సమస్య.. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దానిపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే పులివెందులలో భారీ ర్యాలీ, బంద్ జరిగాయి. ఈ కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న కోణంలో ఈ సమావేశం సాగినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత కోరడంతో.. సీబీఐకు అప్పగించారు. కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీలో ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఇక్కడికి మార్చారు. వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో.. పలుమార్లు విచారించిన ధర్మాసనం కేసు విచారణను 2023 ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని సీబీఐకి స్పష్టంచేసింది. దీంతో సీబీఐ విచారణను స్పీడప్ చేసింది. అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అవినాష్‌ను విచారిస్తే.. కేసు విచారణ పూర్తి అవుతుందని సీబీఐ చెబుతోంది.