»Half The Property Of A Baby Found In A Garbage Dump A Woman With A Great Heart
Aligarh : చెత్తకుప్పలో దొరికిన శిశువుకు సగం ఆస్తి.. గొప్ప మనసు చాటుకున్న మహిళ
ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో చోటు చేసుకుంది.
నవమాసాలు మోసిన తల్లి దూరమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో జరిగింది. స్థానిక స్వర్ణజయంతి నగర్ (Swarna Jayanti Nagar) లో నివాసం ఉండే జయప్రకాశ్ భార్య లత (Lata) సోమవారం సాయంత్రం పాల కోసం బయటకు వెళ్లింది. అప్పుడే పుట్టిన ఓ శిశువు (baby) చెత్త కుప్పలో దొరికితే ఏం చేస్తాం. సాధారణంగా పోలీసుల(Police)కు సమాచారం అందిస్తాం. లేదంటే అంబులెన్స్‌కు సమాచారం అందించి, ఏదో ఒక ఆస్పత్రికి తరలిస్తారు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎంప్లాయిస్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఉన్న ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా లతకు ఓ నవజాతశిశువు (NewBorn Baby ) కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని.. శిశువు గురించి చుట్టుపక్కల వారిని ఆరా తీసింది. ఆ బిడ్డ ఎవరో తమకు తెలియదని స్థానికులు తెలపడంతో ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లింది. చిన్నారి ఆలనాపాలనా చూసుకుంది. అనంతరం ఆ బిడ్డను దత్తత తీసుకుని.. తన పేరుమీద ఉన్న ఆస్తిలో సగం వాటాను చిన్నారి పేరుపై రాయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు లత పెద్ద మనసును అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్(Child Helpline)
కు సమాచారం అందించారు.