»Two And A Half Year Old Child Killed In Monkey Attack
Siddipet District : కోతుల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి బలి
సిద్దిపేటా జిల్లా (Siddipet District) అక్కన్న పేట మండలం కట్కూర్ లో దారుణం జరిగింది. కోతుల దాడిలో (Monkeys) రూపంలో మృత్యువు ఆ బాబును కబళించింది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు ప్రమాదవశాత్తు గాయం కాగా రూ.4 లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు తల్లిదండ్రులు. డబ్బులు పోయినా బిడ్డ దక్కాడన్న సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు .తెలంగాణ లోవివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది.
ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు ప్రమాదవశాత్తు గాయమైతే 4లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించారా తల్లిదండ్రులు. డబ్బులు పోయిన సరే బిడ్డ దక్కాడన్న సంతోషం వారికి ఎన్నో రోజులు నిలువలేదు. కోతుల (Monkeys) రూపంలో మృత్యువు ఆ బాబును కబళించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District) కట్కూరులో జరిగింది. దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి స్లాబు గదులతోపాటు రేకులతో కూడిన వంటశాల ఉంది. రెండింటికి మధ్య గాలి, వెలుతురు కోసం ఉన్న ఖాళీ ప్రదేశంపై తడక పెట్టి…గాలికి ఎగరకుండా బండ రాయి ఉంచారు. ఆ ఖాళీ ప్రదేశం గుండా కోతులు ఇంట్లోకి వచ్చాయి. గమనించిన రజిత (Rajita) కోతులను వెళ్లగొట్టేందుకు వంటింట్లోకి వెళ్లారు. తల్లి వెంట రెండున్నర ఏళ్ల కుమారుడు అభినవ్ (Abhinav) కూడా వెళ్లాడు. కోతులను తరిమికొట్టే క్రమంలో వానరలు ఎగిరి తడకపైకి దూకడంతో।….అక్కడే ఉన్న బండ రాయి కదిలి బాలుడి తలపై పడటంతో తల పగిలి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
నెల రోజుల క్రితం అభినవ్ (Abhinav) ప్రమాదవశాత్తు కింద పడటంతో…కత్తి గొంతులోకి దూసుకెళ్లింది. అప్పడు 4 లక్షలకు పైగా ఖర్చు చేసి బాబును దక్కించుకున్నారు. వానరాల వల్ల ఆ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది.గత మూడు నెలల క్రితం హైదరాబాద్(Hyderabad)లో కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువక ముందే, తెలంగాణలో మరో దారుణ ఘటన జరిగింది.రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువయింది. గుంపులు గుంపులుగా వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి.వెటర్నరీ (Veterinary) విభాగంలో కుక్కలను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నప్పటికి కోతులను పట్టుకునేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బంది లేదు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల ధాటికి తట్టుకోలేక సంప్రదాయ విధానాలతోనే, తమకు తెలిసిన పద్ధతిలోనే ఏటా అయిదారు కోతులకు మించి పట్టుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలే తమ పాట్లేవో తాము పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోతులను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం, సామగ్రి కలిగిన ఏజెన్సీలను ఆహా్వనిస్తూ టెండర్లు పిలిచారు.