»Bhumi Puja For Hundred Bed Hospital In Choutuppal
Choutuppal : సీఎం మాటిచ్చారు.. ఇప్పుడు కడుతున్నాం : హరీశ్ రావు
చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి(Hospital)కి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. జాతీయ రహదారి(National Highway) మీద ప్రమాదాలు జరుగుతాయి. అత్యవసర సమయాల్లో హైదరాబాద్(Hyderabad) వరకు వైద్యం కోసం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటానికి వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయట పడతారు.
Choutuppal : సీఎం కేసీఆర్(CM KCR) మాటిచ్చారంటే తప్పరన్నారు మంత్రి హరీశ్ రావు. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి భూమిపూజ చేశారు . మంత్రి హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో వైద్యం నిమిత్తం రూ. 1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి(Hospital)కి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. జాతీయ రహదారి(National Highway) మీద ప్రమాదాలు జరుగుతాయి. అత్యవసర సమయాల్లో హైదరాబాద్(Hyderabad) వరకు వైద్యం కోసం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటానికి వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయట పడతారు.
నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్ పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తాం. రాష్ట్రం మొత్తంలో నాలుగు మెడికల్ కాలేజీ(Medical college)లు రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చారు. రానున్న రోజుల్లో 500 వరకు బస్తి దవాఖానాల సంఖ్య పెరుగుతుంది. ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ చివరి కల్లా రాష్ట్రం అంతటా న్యూట్రిషన్ కిట్లు అందిస్తాం. జిల్లాల్లో కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తున్నాము. సూర్యాపేట(Suryapet) లో కూడా ఏర్పాటు చేస్తాం. నాడు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించిందన్నారు మంత్రి హరీశ్. 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది తొమ్మిది కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుంది. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.