Errabelli Dayakar Rao: ఏడాదిలో హైదరాబాద్ కు పోటీగా హన్మకొండ
రానున్న ఏడాదిలో రాజధాని హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. నగరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్(KTR)లకే దక్కుతుందన్నారు.
Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణ(Telangana)లో జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. హనుమకొండ(Hanmakonda)లో జరిగిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో రాజధాని హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన జోస్యం చెప్పారు. నగరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్(KTR)లకే దక్కుతుందన్నారు. ఆడపిల్ల పెళ్లికి మేనమామగా రూ.లక్ష ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కర్ణాటక(Karnataka)లో పెన్షన్ 500 వస్తుందన్న మంత్రి.. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా రావట్లేదన్నారు.
తెలంగాణలోనే ప్రతి కుటుంబానికి రూ.2000 పింఛన్‌ను కేసీఆర్ ఇస్తున్నారన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను పొగిడారని మంత్రి తెలిపారు. అయిన సిగ్గు లేకుండా రాష్ట్రంలోని బీజేపీ(BJP) నాయకులు ధర్నా చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. ఉద్యోగాలు ఇయ్యనివారు కూడా ధర్నాలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను దేనీకైనా సిద్ధమంటూ ఎర్రబెల్లి సవాల్ విసిరారు. గ్యాస్(Gas), డీజిల్(Diesel), పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కాజీపేట(Kajipet) కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఏమీ చేయట్లేదని, కాస్త ఆలోచించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు సూచించారు.