»Female Bruce Lee Fight With Boys At Restaurant Viral Video
Viral Video: అబ్బాయిలను చితకబాదిన ఫిమేల్ బ్రూస్ లీ
ఇటీవల ఓ అమ్మాయి(Female Bruce Lee) ఇద్దరు అబ్బాయిలను చితకబాదేసింది. అది కూడా మాములుగా కాదు. సినిమాలో ఫైట్ చేసిన మాదిరిగా వారిని పారిపోయేలా ఫైట్ చేసింది. ఓ రెస్టారెంట్లో ఈ ఫైట్ జరుగగా..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వీడియో(viral video)పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ప్రస్తుత కాలంలో ఆత్మరక్షణ చాలా అవసరం. ప్రధానంగా అమ్మాయిలకైతే తప్పనిసరి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒంటరిగా వెళుతున్న యువతులపై పలువురు దుండుగులు దాడులు సహా అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు చుశాం. ఇలాంటి క్రమంలో అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు ఖచ్చితంగా ప్రాథమికంగా ఆత్మరక్షణ టెక్నిక్స్ తెలుసుకోవాలి. అయితే ఇదే విధంగా ఓ రెస్టారెంట్లో పనిచేసే యువతి కూడా అబ్బాయిల విషయంలో ప్రవర్తించింది. అది కూడా మామాలుగా కాదు. వీర లెవల్లో ఇద్దరితో బ్రూస్ లీ(Female Bruce Lee) మాదిరిగా ఫైట్ చేసి వారు పారిపోయేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఇక వీడియోలో చూస్తే ఇద్దరు వ్యక్తులు కూర్చున్న టేబుల్ దగ్గర నిల్చున్న వెయిట్రెస్‌తో క్లిప్ మొదలవుతుంది. ఆ క్రమంలో ముందు టేబుల్‌పై పేరుకుపోయిన అనేక ఖాళీ సీసాలు (బహుశా బీరు) ఉన్నాయి. ఆ నేపథ్యంలో వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడి వెయిట్రెస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. దీంతో ఆమె వేగంగా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అతను రెండోసారి పట్టుకున్న తర్వాత..ఆ యువతి అతని కడుపు, ముఖంపై కొట్టింది. ఇంతలో రెండో టేబుల్ పై ఉన్న వ్యక్తి ఆమెతో పోరాడటానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఆమె అతన్ని కూడా తన్నేసింది. దీంతో ఆ వ్యక్తి అక్కడే ఉన్న కుర్చితో దాడి చేయగా..ఆమె చాకచక్యంగా చైర్ పట్టుకుని అతన్ని బలంగా తన్ని పడేసింది. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా…ప్రస్తుతం ఈ వీడియో(video) నెట్టింట వైరల్(viral) గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. లేడీ బ్రూస్ లీ అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవ్యక్తి అయితే అచ్చంగా సినిమాలో సీన్ మాదిరిగా ఉందని కామెంట్ చేశారు. అంతేకాదు ఈ వీడియో ట్విట్టర్లో ఇప్పటికే 3.5 మిలియన్ల వ్యూస్ ను సాధించగా, దాదాపు ఏడు వేల మంది రీ ట్వీట్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.