సాధారణంగా మద్యం షాపుల ముందు మనుఘలు మందు కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు (Monkeys) కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకదాటిగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.ఎవరైనా బాగా అల్లరి చేస్తే ‘కల్లు తాగిన కోతి‘ అనే సామెతను వాడుతుంటారు. అయితే రియల్‌గా ఓ కోతి మందు బాటిల్(Whiskey bottle)ను లేపి ఎత్తింది దించకుండా తాగుతూనే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
దిమ్మెపై కూర్చున్న ఆ కోతి మందు బాటిల్ ఎంచక్కా లేపి తాగింది. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అయితే ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికి వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు కోతికి అల్కహాల్ (Alcohol) బాటిల్ ఇవ్వడంపై మండి పడుతున్నారు. ఇట్స్ నాట్ ఫన్నీ అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంత మంది ఎంచక్కా తాగుతుందో చూడండి అంటూ కామెంట్ చేస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం కోతులకు ఆహారం, పండ్లు, నీళ్లు ఇవ్వాలని ఇలా మద్యం ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు (Netizens) పూర్వజనలో మందు బాబు ఈ జన్మలో ఇలా పుట్టి ఉంటాడు అందుకే మందు పిచ్చి ఎక్కువగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.